Telugu Gateway
Cinema

వంద కోట్ల క్లబ్ లో మిరాయి

వంద  కోట్ల క్లబ్ లో మిరాయి
X

తేజా సజ్జా మళ్ళీ కొట్టాడు. వరసగా తన రెండు సినిమాలను వంద కోట్ల క్లబ్ లోకి చేర్చటం ద్వారా ఈ యువ హీరో కొత్త రికార్డు ను నమోదు చేశాడు అనే చెప్పాలి. గత ఏడాదే తొలిసారి సూపర్ హీరో మూవీ హను మాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజా సజ్జా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 294 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ యోధా మూవీ తో వరసగా తన రెండవ సినిమా ను కూడా వంద కోట్ల క్లబు లో చేర్చాడు. తేజా సజ్జా, మంచు మనోజ్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది.

మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవటంతో కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. అమెరికా లో కూడా ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఈ సినిమా లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, తేజా సజ్జా యాక్షన్ సన్నివేశాలు, విలన్ రోల్ లో మంచు మనోజ్ పవర్ ఫుల్ యాక్షన్ సినిమాను ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇందులో గౌర హరి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది అనే చెప్పాలి. అయితే మిరాయి మూవీ హను మాన్ రికార్డు ను అందుకోవటం కష్టమే అనే చెప్పొచ్చు.

Next Story
Share it