మరో సెన్సేషన్ ఖాయమా!

తేజ సజ్జా కొత్త సినిమా మిరాయ్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హనుమాన్ సినిమా ఊహించని విజయం దక్కించుకోవటంతో ఈ యువ హీరో దేశ వ్యాప్తంగా కూడా మంచి పేరు దక్కించుకున్నాడు. మిరాయ్ సినిమా టీజర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ సోమవారం నాడు వెల్లడించింది. మే 28 న టీజర్ విడుదల చేయనున్నట్లు హీరో న్యూ లుక్ తో వెల్లడించారు. ఇందులో హీరో తేజ సజ్జా రైలు ఇంజన్ పై ఒక యాక్షన్ మోడ్ లో ఉంటాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
ఈ సినిమా లో తేజ సజ్జాతో పాటు మరో హీరో మంచు మజోజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల అయిన గ్లింప్స్ సినిమా పై అంచనాలను పెంచింది అనే చెప్పాలి. మిరాయ్ లో తేజ సూపర్ యోదాగా కనిపించనున్నాడు . ఇందులో తేజ కు జోడిగా రితికా నాయక్ నటిస్తోంది . ఈ సినిమా మొత్తం ఏడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది . మిరాయ్ టీజర్ విడుదల తర్వాత లెక్క వేరేలా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచే పనిలో ఉంది అని చెప్పొచ్చు. మిరాయ్ ఆగస్ట్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.