ప్రముఖ నటి వి జె చిత్ర ఆత్మహత్య
విషాదం. ప్రముఖ తమిళ నటి వీ జె చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయస్సు 28 సంవత్సరాలు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక హోటల్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిరోజులక్రితమే ఆమెకు వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే హేమంత్‌తో కలిసి ఉన్న హోటల్ గదిలోనే ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించటం కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం స్నానం చేసి వస్తానని వెళ్లిన చిత్ర.. ఎంతకీ తలుపు తీయకపోవడంతో హేమంత్ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.
దీంతో హోటల్ సిబ్బంది డూప్లికేట్ కీతో గది తలుపులు తెరిచారు. గదిలో చిత్ర చీరతో ఉరి వేసుకుని కన్పించింది. చిత్ర ఆత్మహత్య చేసుకోవడంపై తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. పాపులర్ టీవీ షో 'పాండ్యన్ స్టోర్స్'తో ఆమె మంచి నటిగా గర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.