ఎఫ్3 సెట్స్ లో తమన్నా
BY Admin1 Feb 2021 12:58 PM GMT
X
Admin1 Feb 2021 12:58 PM GMT
'మీ చమత్కారమైన హారిక మళ్ళీ వచ్చేసింది. కాకపోతే ఈ సారి మరింత సందడి'తో అంటూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసింది తమన్నా. ఎఫ్3 సెట్స్ లో తిరిగి జాయిన్ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విషయం సాధించిందో తెలిసిందే.
ఈ సినిమాలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్ లు జంటగా నటించగా..ఇప్పుడు అదే కాంబినేషన్ తో ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది.
Next Story