Telugu Gateway
Cinema

ఐటి దాడులపై స్పందించిన తాప్సీ

ఐటి దాడులపై స్పందించిన తాప్సీ
X

ప్రముఖ బాలీవుడ్ నటి తాప్సీ ఐటి దాడుల వ్యవహారంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. గత మూడు రోజులుగా హీరోయిన్ తాప్సీతోపాటు దర్శకుడు అనురాగ్ కశ్యప్, మరికొంత మందిపై ముంబయ్ లో ఐటి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో 650 కోట్ల రూపాయల మేరకు పన్ను కట్టని లావాదేవీలు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాప్సీ మాత్రం తనకు పారిస్ లో ఓ బంగ్లా ఉందని అంటూ ఆ ఇంటి తాళాల కోసం ఐటి అధికారులు వెతికారని పేర్కొన్నారు. దీంతోపాటు ఐదు కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి రశీదుల కోసం చూశారని..కానీ తాను అంత మొత్తం ఎప్పుడూ తీసుకోలేదిన తెలిపారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటి దాడులు జరిగిన విషయం తనకు గుర్తులేదన్నారు

దేశంలో సాగుతున్న రైతుల ఉధ్యమానికి మద్దతు ఇచ్చినందుకే తాప్సీపై ఐటి దాడులు అంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అదే సమయంలో రైతులను టెర్రిరిస్టులకు అభివర్ణించిన కంగనా రనౌత్ కు మాత్రం కేంద్రం వై క్యాటరీ రక్షణ కల్పించిందని,,రైతులకు మద్దతుగా మాట్లాడినందుకు తాప్సీపై ఐటి దాడులు చేస్తున్నారంటూ రెండు అంశాలనూ పోల్చుతూ ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ కేంద్ర నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

Next Story
Share it