పాన్ ఇండియా ను మించి!

కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్దార్ధ్. ఆయన హీరోగా నటిస్తున్న సినిమానే ‘స్వయంభు’. గత రెండు సంవత్సరాలుగా సిద్దార్ధ్ ఇదే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. దీంతో చిత్ర యూనిట్ సోమవారం నాడు అధికారికంగా ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించింది. ఈ మూవీ లో నిఖిల్ కు జోడిగా సంయుక్త మీనన్, నభా నటేష్ లు సందడి చేయనున్నారు. ‘స్వయంభు’ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ను విడుదల చేస్తున్నారు.
అంతే కాదు...చైనీస్, స్పానిష్ , అరబిక్ భాషల్లో కూడా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా చారిత్రిక నేపథ్యంలో సాగినట్లు తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తే అర్ధం అవుతోంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుంటే..సినిమాటోగ్రాఫర్ గా కె కె సెంథిల్ కుమార్ పని చేశారు. భారీ ఎత్తున వేసిన సెట్టింగ్స్ ద్వారా ఈ సినిమా నిర్మించినట్లు హీరో నిఖిల్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ వీడియో లో వెల్లడించారు. ఈ సినిమా కోసం మొత్తం 170 రోజులు షూటింగ్ చేసినట్లు తెలిపాడు.



