సర్కారువారి పాట ఓటీటీలోనూ 'వేలంపాట'
పరశ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై మిక్స్ డ్ ఓపీనియన్ వ్యక్తం అయింది. ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోతే..సెకండాఫ్ ను మాత్రం సాగదీశారనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఓ వైపు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అంత ధర నిర్ణయించటం సినీ అభిమానులకు ఏ మాత్రం రుచించటం లేదు. ఇలాంటి నిర్ణయాలు అ న్నీ ముందు ముందు సినిమా పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.