Telugu Gateway
Cinema

వెంకీ అట్లూరి కొత్త సినిమా మొదలు

వెంకీ అట్లూరి కొత్త సినిమా మొదలు
X

ప్రేమలు హీరోయిన్ మమిత బైజు ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో భాగస్వామి అయింది. సూర్య హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో ఆమె ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సోమవారం నాడు హైదరాబాద్ లో ఈ సినిమా ఫస్ట్ షాట్ కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. మే నెలాఖరు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ కానుంది అని చిత్ర యూనిట్ చెపుతోంది. సినిమా విడుదల వచ్చే ఏడాది ఉంటుంది అని తెలిపారు.

లక్కీ భాస్కర్ సినిమా తో గత ఏడాది సూపర్ డూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావటంతో ఈ సినిమా పై కూడా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ దర్శకుడు వరసగా సితార బ్యానర్ పైనే సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వెంకీ తో కలిసి సినిమా చేయటం తమకు ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది అని నిర్మాత నాగ వంశీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయన తో కలిసి వరసగా సినిమా లు చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా ప్రారంభం అయిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాకు కూడా జీ వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. వెంకీ అట్లూరి సినిమాలకు ఆయనే వరుసగా మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. ఇది సూర్య 46 వ సినిమా.

Next Story
Share it