Telugu Gateway
Cinema

సెకండ్ వీక్ లోనూ అదే హవా

సెకండ్ వీక్ లోనూ అదే హవా
X

ఫ్యామిలీ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పదిహేను రోజుల్లోనే ఈ విషయం రెండు సార్లు ప్రూవ్ అయింది. సూర్య, మమిత బైజు జంటగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. విడుదల అయిన రెండవ వారంలో కూడా థియేటర్లు ఫుల్ అయ్యాయి అంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో తెలుస్తోంది. మరో వైపు రవి తేజ హీరో గా తెరకెక్కిన ఇరుముడి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డు లు నమోదు చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు దక్కనన్ని బుకింగ్స్ ఇరుముడి కు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే వెంకీ అట్లూరి తెరకెక్కించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కొత్త రికార్డు ను నమోదు చేసింది.

ఈ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ కొంత స్లో అయినా కూడా ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరో సూర్య తో పాటు మమిత బైజు, రాధికల నటనకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడా రాజీపడకుండా సినిమాను రిచ్ గా తెరకెక్కించింది. ఈ సినిమాకు జీ వీ ప్రకాష్ మ్యూజిక్ అందించారు.

Next Story
Share it