Telugu Gateway
Cinema

వ్యక్తిగత వీడియోలు బయటకి!

వ్యక్తిగత  వీడియోలు బయటకి!
X

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు సురేఖ వాణి. ఆమె చాలా సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో సోషల్ మీడియా లో కూడా సురేఖ వాణి ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఆమెకు చెందిన వ్యక్తిగత వీడియోలు కొన్ని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. ఆమె వ్యక్తిగత వీడియోలు బయటకు రావటం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. కొన్ని మీడియా ఛానెల్స్ అయితే వీటిపై వార్తలు కూడా ప్రసారం చేశాయి. ఈ ఘటన తర్వాత ఆమె తన ఖాతా నుంచి ఈ వీడియో లను తొలగించారు. అదే సమయంలో ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టారు. తన ఇన్స్టా గ్రామ్ హ్యాక్ అయ్యింది అని వెల్లడించారు. అందుకే తన పర్శనల్ వీడియోస్ బయటకి వచ్చాయి అని దయచేసి వాటిని ఎవరూ సర్క్యులేట్ చేయొద్దని కోరారు

సోషల్ మీడియా యాప్స్ లో కానీ మరే ఇతర ప్లాట్ ఫామ్ లలో అలా ప్రచారం చేసి తన పర్శనల్ లైఫ్ కి ఉన్న భద్రతకు భంగం కలిగించవద్దని కోరారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. మీమ్ పేజీలు...మీడియా సంస్థలు, యూ ట్యూబ్ ఛానెల్స్, వ్యక్తులు ఎవరైనా సరే తన వ్యక్తిగత విషయానికి చెందిన కంటెంట్ ను షేర్ చేయటం...రీ పోస్ట్ చేయటం తక్షణమే ఆపాలని కోరారు. వ్యూస్, పబ్లిసిటీ కోసం ఈ కంటెంట్ ను..తన పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవద్దు అన్నారు. తన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి అని..ఇది చాలా సీరియస్ అంశం అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. దీనితో ఈ పోస్ట్ కూడా వైరల్ గా మారింది.

Next Story
Share it