అపోలో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్
BY Admin25 Dec 2020 7:52 AM GMT
X
Admin25 Dec 2020 7:52 AM GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన హై బీపీతో బాధపడుతున్నారు. రజనీకాంత్ బీపీ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నట్లు అపోలో ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. రజనీ ఆరోగ్యాన్ని కుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు.
అయితే టీమ్ లోని కొంత మందికి కరోనా పాజిటివ్ అని తేలటంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అందరితోపాటే రజనీకాంత్ కూడా ఈ నెల 22న కరోనా పరీక్షలు చేసినా నెగిటివ్ అని వచ్చింది. రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన చేయాల్సిన తరుణంలో రజనీకాంత్ ఇలా ఆస్పత్రిలో చేరాల్సి రావటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Next Story