Telugu Gateway
Cinema

రామోజీ ఫిల్మ్ సిటీలో మెగా ఈవెంట్

రామోజీ ఫిల్మ్  సిటీలో మెగా  ఈవెంట్
X

సంచలన దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఈ మూవీ కి సంబంధించిన అప్ డేట్స్ ఒక్కటి కూడా అధికారికంగా బయటకు రాలేదు. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది. అంతే కానీ ఈ సినిమా విషయాలు ఏమీ చిత్ర యూనిట్ బహిర్గతం చేయలేదు. ఈ సినిమా వివరాల కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 15 న ఈ సినిమా ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ఈ ఈవెంట్ లోనే టైటిల్ తో పాటు ఇతర విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. ఈ మూవీ ఈవెంట్ ను దేశ వ్యాప్తంగా జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. ఇది అంతా చూస్తుంటే ఫస్ట్ ఈవెంట్ లో పలు కీలక విషయాలు వెల్లడించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ ఎస్ఎస్ఎంబి 29 పై సోషల్ మీడియా వేదికగా ఈ అప్డేట్ ఇచ్చాడు. సినిమాను సెలబ్రేట్ చేసుకునే సిటీ హైదరాబాద్ వేదికగా ఎస్ఎస్ఎంబి 29 థండరింగ్ ట్రీట్‌ను రెడీ చేస్తున్నామని.. రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుండి ఈ ట్రీట్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆయన ఓ వీడియో రూపంలో తెలిపారు. అయితే ఈ ట్వీట్ లో గ్లోబ్ ట్రోటర్ అంశాన్ని ప్రస్తావించటంతో టైటిల్ ఇదేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it