Telugu Gateway
Cinema

వ‌చ్చే వేస‌విలో మ‌హేష్ బాబు సినిమా

వ‌చ్చే వేస‌విలో మ‌హేష్ బాబు సినిమా
X

షూటింగ్ కూడా మొద‌లుపెట్టక ముందే విడుద‌ల తేదీ చెప్పేశారు. మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఎస్ఎస్ఎంబి28 సినిమా షూటింగ్ ఈ ఆగ‌స్టు నుంచి ప్రారంభం కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ శ‌నివారం నాడు అధికారికంగా ప్ర‌క‌టించింది. అంతే కాదు.. ఈ సినిమా విడుద‌ల కూడా 2023 వేస‌విలో అంటూ ఇప్పుడే ప్ర‌క‌టించేశారు. ఈ సినిమాలో మ‌హేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డె న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త‌మ‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it