'సలార్ 'లో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్
BY Admin28 Jan 2021 11:26 AM IST
X
Admin28 Jan 2021 11:26 AM IST
'సలార్' హీరోయిన్ ఎవరో తేలిపోయింది. శృతిహాసన్ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెబుతూ హీరో ప్రభాస్..నీతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. దీంతో సలార్ లో శృతి హీరోయిన్ అనే విషయం నిర్ధారణ అయిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ వారంలోనే సలార్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే సింగరేణి బొగ్గు గనిలో ఫైటింగ్ సీన్ కోసం సెట్ సిద్ధం చేస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు భువన్‌గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఆమె రవితేజతో కలసి నటించిన 'క్రాక్' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది.
Next Story