Telugu Gateway
Cinema

మైత్రి ఇన్ లవ్ ఫస్ట్ లుక్ రిలీజ్

మైత్రి ఇన్ లవ్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

టాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్ వస్తోంది. అది ఎలా అంటారా?. సీనియర్ హీరో శ్రీకాంత్..ఊహల కూతురు మేధ హీరోయిన్ గా కొత్త సినిమా మొదలైంది. ఈ సినిమా టైటిల్ ‘మైత్రీ ఇన్‌ లవ్‌’. ఇప్పటికే శ్రీకాంత్ కొడుకు మేకా రోషన్ టాలీవుడ్ హీరోగా ఉన్న విషయం తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఏమో ఏమో ఇది మూవీ లో ఇప్పుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ‘మైత్రీ ఇన్‌ లవ్‌’ మూవీ లో హీరో, హీరోయిన్ లు ఇద్దరూ కొత్తవాళ్లే.

ఈ సినిమాతో జాస్తి జై హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మూవీ ని నిర్మిస్తున్నది టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. పృథ్వీ వనం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సోమవారం నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే మేకా మేధకి వెండితెర కొత్తేం కాదు. అనుష్క ప్రధానపాత్రలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో మేధ చిన్నప్పటి రుద్రమదేవి పాత్రలో నటించింది.

Next Story
Share it