Telugu Gateway
Cinema

శ్రీదేవి సోడా సెంట‌ర్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

శ్రీదేవి సోడా సెంట‌ర్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది
X

సుధీర్ బాబు, ఆనంది జంట‌గా న‌టిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంట‌ర్. ఈ సినిమా ఆగ‌స్టు 27న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న విష‌యం తెలిసిందే. చిత్ర యూనిట్ గురువారం నాడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేసింది. గ్రామీణ నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కించారు. హీరో సుధీర్ బాబు లైటింగ్ ఏర్పాట్లు ప‌ని చేసేవాడు అయితే..హీరోయిన్ ఆనంది మాత్రం సోడా సెంట‌ర్ న‌డుపుతుంది.

ఇది క‌లుపుతూ...ట్రైల‌ర్ లో డైలాగ్ పెట్టారు. నువ్వు సోడాల శ్రీదేవి అయితే..నాది లైటింగ్..లైటింగ్ సూరిబాబు ఇక్క‌డ అంటాడు హీరో. అయితే వెళ్ళి లైటింగ్ పెట్టుకో..లైటింగ్ కొట్ట‌మాకు అనే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించారు. ఈ ట్రైల‌ర్ ను హీరో మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు.

Next Story
Share it