Telugu Gateway
Cinema

ఆగ‌స్టు 27న 'శ్రీదేవి సోడా సెంటర్

ఆగ‌స్టు 27న శ్రీదేవి సోడా సెంటర్
X

టాలీవుడ్ లో పెద్ద హీరోలు అంద‌రూ ప్ర‌స్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. త‌మ త‌మ సినిమాల‌కు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈ త‌రుణంలో దొరికిన గ్యాప్ ను చిన్న హీరోలు స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే వ‌ర‌స పెట్టి సినిమాల విడుద‌ల‌కు ముహుర్తాలు ఖ‌రారు చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే హీరో సుధీర్ బాబు హీరోగా న‌టించిన 'శ్రీదేవి సోడా సెంటర్‌' సినిమా ఆగ‌స్టు 27న విడుద‌ల కానుంది. 'పలాస 1978' ఫేమ్‌ కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీదేవి పాత్రలో ఆనంది నటించారు. గోదావరి జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్య సంగీతం అందిస్తున్నారు.

Next Story
Share it