Telugu Gateway
Cinema

కనిపించని కృతి శెట్టి...శ్రీలీల హవా

కనిపించని కృతి శెట్టి...శ్రీలీల హవా
X

ఒకరు ఎంట్రీ తోనే అదరగొట్టారు. మరొకరు మాత్రం తొలి సినిమా లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. సినిమా రంగంలో అభినయానికి తోడు అదృష్టం కూడా కలిసి రావాలి అనటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇదే శ్రీలీల, కృతి శెట్టి ల స్టోరీ. ఉప్పెన సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కి ఇక అసలు తిరుగు ఉండదు అని భావించారు అందరూ. ఆ సినిమా తర్వాత కొన్ని అవకాశాలు వరసగా వచ్చినా కూడా కూడా ఇప్పుడు టాలీవుడ్ లో కృతి శెట్టి పేరు అందరూ మర్చి పోయే పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఉప్పెన భామకు తెలుగులో ఇప్పుడు అవకాశాలు ఏమీ రావటం లేదు అని చెపుతున్నారు. . మరో వైపు పెళ్లి సందడి సినిమా తో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మాత్రం ఇప్పుడు చేతి నిండా సినిమాలతో టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళిపోయింది. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న సినిమా లే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు శ్రీలీల మహేష్ బాబు తో కలిసి గుంటూరు కారం సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. విజయదేవరకొండ సినిమాతో పాటు పంజా వైష్ణవ తేజ్, నితిన్ లతో కలిసి నటించనుంది. మొత్తం మీద ఇప్పుడు శ్రీలీల చేతిలో ఏకంగా తొమ్మిది సినిమాలు ఉన్నాయి

. అందం, అభినయం విషయానికి వస్తే శ్రీలీల కంటే కృతి శెట్టి కే ఒకటి రెండు మార్కులు ఎక్కువ పడతాయి. కానీ రవితేజ ధమాకా దగ్గరనుంచి శ్రీలీల ట్రాక్ మారిపోయింది అని చెప్పాలి. ఈ సినిమాలో పాటలకు శ్రీ లీల డాన్స్ లు, యాక్షన్ కూడా ప్రేక్షుకులను ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కు రాని అన్ని అవకాశాలు ఈ యువ హీరోయిన్ దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పుడు చేతిలో లో ఉన్న కీలక హీరోల సినిమాలు హిట్ అయినా కూడా శ్రీలీల కు మరి కొన్ని సంవత్సరాలు డోకా ఉండకపోవచ్చు. మరి కృతి శెట్టి కి లెక్క ఎక్కడ తేడా కొట్టిందో కానీ ఇప్పుడు ఆమె పేరు పెద్దగా వినపడటం లేదు అనే చెప్పాలి. ఒక సారి సైడ్ ట్రాక్ అయినా తర్వాత మళ్ళీ తిరిగి వెలుగు వెలగాలంటే ఒకింత కష్టమే అని చెపుతున్నారు.

Next Story
Share it