Telugu Gateway
Cinema

విభిన్నంగా 'శ్రీకారం టీజర్'

విభిన్నంగా శ్రీకారం టీజర్
X

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటిస్తున్న సినిమా 'శ్రీకారం'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో డైలాగ్ లు ఆకట్టుకునేలా..అర్ధవంతంగా ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన అంశంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే అర్ధమవుతోంది. 'ఒక హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేస్తున్నాడు. ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ చేస్తున్నాడు.

కానీ ఒక్క రైతు మాత్రం తన కొడుకును రైతు చేయటం లేదు. ఈ ఒక్కటి నాకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. తినేవాళ్లు మన నెత్తిమీద జుట్టు అంత మంది ఉంటే..పండించే వాళ్లు పండించే వాళ్లు మూతి మీద మీసం అంత కూడా లేరు. ' అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ లు హైలెట్ గా నిలుస్తాయి. శ్రీకారం...కొత్త సంకల్పానికి అంటూ టీజర్ ముగుస్తుంది. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.

Next Story
Share it