Telugu Gateway
Cinema

పెళ్ళికి..పెళ్ళానికి దూరంగా ఉండాలనే వార్నింగ్ ఇవ్వాలి

పెళ్ళికి..పెళ్ళానికి దూరంగా ఉండాలనే వార్నింగ్ ఇవ్వాలి
X

'అసలు వీడు ఎవడు. ఏమి చేసి ఉంటాడు. వీళ్లు ఖర్చు పెట్టి మరీ వీడి కటౌట్ ఎందుకు తగలబెడుతున్నారు. ఇది అంతా తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి.' అంటూ మొదలవుతుంది సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ట్రైలర్. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. 'మన రాజ్యాంగం మనకు స్వేచ్చగా బతకమని కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది.వాటిని మనం ఈ ప్రేమ, పెళ్ళి అని కమిటెడ్ రిలేషన్స్ తో నాశనం చేసుకుంటున్నాం. వుయ్ ఆర్ లూజింగ్ అవర్ రైట్స్ అంటూ ఆవేశంగా మాట్లాడతాడు' హీరో సాయి తేజ్. ఎందుకంటే ఈ సినిమా టైటిలే సోలోబ్రతుకే సో బెటర్ మరి.

ఈ సినిమా హాల్లో మందుకు, సిగరెట్లకు దూరంగా ఉండాలి అని వార్నింగ్ ఇస్తారుగా..అలాగే పెళ్ళికి, పెళ్ళానికి దూరంగా ఉండాలి అనే వార్నింగ్ ఇవ్వాలి అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. పెళ్ళి బాగుంటుంది బ్రో అంటూ వెన్నెల కిషోర్ చేసే కామెడీ పడుతుంది. పద్దతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూ కంపాలు వస్తాయి సర్ అంటూ సాయి తేజ్ రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో ఆకట్టుకుంటుంది.

Next Story
Share it