సెప్టెంబర్ 15న సోదర సోదరీమణులారా

'సోదర సోదరీమణులారా...'అంటూ . ఆకట్టుకునే టైటిల్, ఎమోషనల్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతోంది. టైటిల్, పోస్టర్ తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామా గా ఈ సినిమా ఉండనుంది అనే ఫీలింగ్ కలిగిస్తోంది.