Telugu Gateway
Cinema

భ‌లే భ‌లే 'స్కైలాబ్' ట్రైల‌ర్

భ‌లే భ‌లే స్కైలాబ్ ట్రైల‌ర్
X

'అరె శ్రీను ఊరంతా తిరిగి వార్త‌లు తీసుకురా. ఇక నేను రాసుడు మొద‌లుపెడ‌తా.' ఇదీ ఈ సినిమాలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసే నిత్య‌మీన‌న్ చెప్పే డైలాగ్. ఈ డైలాగ్ తో ప్రారంభం అవుతుంది 'స్కైలాబ్' సినిమా ట్రైల‌ర్. ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను ఓ రేంజ్ లో పెంచుతుంద‌నే చెప్పొచ్చు. ఇందులో స‌త్య‌దేవ్, నిత్య‌మీన‌న్ లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వీరితోపాటు రాహుల్ రామ‌క్రిష్ణ‌, త‌నికెళ్ల భ‌ర‌ణిలు ఉన్నారు.

ట్రైల‌ర్ చివ‌రిలో ఓ రాజ‌కీయ నాయ‌కుడు ఆ స్కైలాబ్ ను కొంచెం ఇటు తిప్పి..పాకిస్తాన్ మీద ఎత్తేస్తే పాకిస్తాన్ పాయె..స్కైలాబ్ పాయె.. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అంటూ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. విశ్వ‌క్ ఖండేరావు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. డిసెంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఆ స‌ర‌దా ట్రైల‌ర మీరూ చూసేండి.

Next Story
Share it