Telugu Gateway
Cinema

నాని కొత్త సినిమా 'దస‌రా'

నాని కొత్త సినిమా దస‌రా
X

హీరో నాని, కీర్తి సురేష్ మ‌రోసారి జోడీ క‌డుతున్నారు. అదే 'దస‌రా' సినిమా. సినిమా టైటిలే ద‌స‌రా. అది కూడా ద‌స‌రా పండ‌గ రోజు ప్ర‌క‌టించారు. అంతే కాదు..'జ‌మ్మివెట్టి చెప్పాన్న బ‌ద్ద‌ల్ బాసింగాలైతై, సూస్ కుందాం' అంటూ టైటిల్ కింద రాసుకొచ్చారు. శ్రీకాంత్ ఒదెల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. నాని హీరోగా న‌టింటిన ట‌క్ జ‌గ‌దీష్ సినిమా ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లైన విష‌యం తెలిసిందే. దీంతోపాటు నాని న‌టిస్తున్న శ్యామ్ సింగ‌రాయ్ సినిమా ఈ డిసెంబ‌ర్ లో సంద‌డి చేయ‌నుంది. దీంతో నాని కొత్త ప్రాజెక్టును పండ‌గ సంద‌ర్భంగా ప్రక‌టించారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా నాని వ‌ర‌స పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Next Story
Share it