Telugu Gateway
Cinema

వేడుకగా గాయని సునీత వివాహం

వేడుకగా గాయని సునీత వివాహం
X

ప్రముఖ గాయని సునీత వివాహం శనివారం రాత్రి హైదరాబాద్ లోని శంషాబాద్ లో జరిగింది. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని, సునీతలు వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో పెళ్లి వేడుక జరిగింది. వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇండస్ట్రీ నుంచి హీరో నితిన్ భార్య శాలినితో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. సునీత, రామ్‌లు ఇరువురికి కూడా ఇది రెండో పెళ్లి. సునీత 19 ఏళ్ళ వ‌య‌స్సులో వివాహం చేసుకోగా.. తర్వాత కొన్నేళ్లకు భ‌ర్తతో విభేదాల నేపథ్యంలో డైవ‌ర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పెళ్లి పోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Next Story
Share it