Telugu Gateway
Cinema

సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా షురూ

సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా షురూ
X

హీరోలకు కొన్ని కొన్ని సినిమాలు జీవిత కాలం గుర్తు ఉండేలా పేరు తెచ్చిపెడతాయి. టాలీవుడ్ లోకి సిద్దు జొన్నగడ్డ ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అయినా...డీజే టిల్లు సినిమా దగ్గర నుంచే ఈ హీరో రేంజ్ మారిపోయింది. డీజే టిల్లు నే కాకుండా తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే జోష్ తో టిల్లు క్యూబ్ కూడా ప్రకటించారు. దీనికి ఇంకా సమయం ఉండటంతో ఇప్పుడు ఈ హీరో కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయి పోయాడు.

కొద్ది రోజుల క్రితం నీరజ కోన దర్శకత్వంలో “తెలుసు కదా” సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ షెడ్యూల్ సుమారు 30 రోజులు పాటుగా కొనసాగనుంది. ఈ సినిమాలో సిద్ధుకు జోడిగా రాశీ ఖన్నా, కేజీయఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించనున్నారు. వరసగా రెండు సూపర్ డూపర్ హిట్స్ దక్కించుకున్న సిద్దు జొన్నలగడ్డకు మరి ఈ తెలుసుకదా మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it