Telugu Gateway
Cinema

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
X

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా తెలుసుకదా. దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందలకే పరిమితం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. బడ్జెట్ కు...ఈ సినిమా కలెక్షన్స్ ప్రకారం చూస్తే ఇది మరో ప్లాప్ సినిమా గా మిగిలిపోయినట్లే. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ కు జోడిగా రాశీ ఖన్నా తో పాటు శ్రీనిధి శెట్టి నటించిన సంగతి తెలిసిందే. నీరజ కోనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటిటి డేట్ ను అనౌన్స్ చేశారు. దీని ప్రకారం తెలుసుకదా మూవీ నవంబర్ 14 నుంచి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

తెలుగు తో పాటు హిందీ , తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది అని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీ మ్యాజికల్ లవ్ స్టోరీ కాదు...రాడికల్ లవ్ స్టోరీ అని పేర్కొంది. సిద్దు జొన్నలగడ్డ టిల్లు సినిమాల ఇమేజ్ నుంచి బయటపడి రెగ్యులర్ హీరోగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ కూడా సత్ఫాలితాలు ఇవ్వటం లేదు. ఎందుకంటే మొదట చేసిన జాక్ సినిమా కూడా ఆకట్టకుకోలేకపోయింది...ఇప్పుడు తెలుసుకదా మూవీ ఫలితం కూడా నిరాశాజనంగానే మిగిలిపోయింది. మరి రాబోయే ఈ హీరో బాదాస్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Next Story
Share it