దసరా సందడి మొదలైంది. పలు సినిమాలు ఈ సందర్భంగా కొత్త కొత్త అప్ డేట్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగానే నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాకు సంబంధించి కూడా కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో నాని వాసు పాత్రలో కన్పించనున్నారు. ఆయన లుక్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో సాయిపల్లవితోపాటు కృతిశెట్టి నటించనున్న విషయం తెలిసిందే. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా శుభాకాంక్షలు చెబుతూ తాజా విషయాలను షేర్ చేసుకున్నారు.