ఆకట్టుకుంటున్న శ్యామ్ సింగరాయ్ ట్రైలర్
మంగళవారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదే నాని తొలి పాన్ ఇండియా సినిమాగాచెప్పొచ్చు . రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నిర్మించింది.