Telugu Gateway
Cinema

'శ్యామ్ సింగ‌రాయ్' న్యులుక్

శ్యామ్ సింగ‌రాయ్ న్యులుక్
X

నాని హీరోగా న‌టిస్తున్న 'శ్యామ్ సింగ‌రాయ్' సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల తేదీ వ‌చ్చేసిన విష‌య తెలిసిందే. డిసెంబ‌ర్ 24న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. శ్యామ్ సింగ‌రాయ్ సినిమాకు సంబంధించి న‌వంబ‌ర్ 6న తొలి లిరిక‌ల్ సాంగ్ ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ అప్ డేట్ ఇస్తూ తాజాగా విడుద‌ల చేసిన లుక్ లో నాని డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌న్పిస్తున్నారు.

ఈ సినిమాలో నానికి జోడీగా సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మాడోన్నా సెబాస్టియ‌న్ లు సంద‌డి చేయ‌నున్నారు. రాహుల్ సంకీర్త్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంలో కూడా విడుద‌ల కానుంది. నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ సినిమా కొత్త రోజుల క్రితం ఓటీటీలో విడుద‌లైన విష‌యం తెలిసిందే.

Next Story
Share it