ఓటీటీలో 'శ్యామ్ సింగరాయ్'
BY Admin20 Jan 2022 12:44 PM GMT

X
Admin20 Jan 2022 12:44 PM GMT
అలా థియేటర్ లో వచ్చిందో లేదో ఆ వెంటనే ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. తాజాగా బ్లాక్ బస్టర్ అయిన పుష్ప సినిమా కూడా అప్పుడే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త సినిమా కూడా అదే బాట పట్టింది. న్యాచురల్ స్టార్ నాని, సాయిపల్లవి, కృతిశెట్టిలు నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ శుక్రవారం నుంచి అంటే జనవరి 21 నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమాలో మరో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ లాయర్ గా నటించి మెప్పించింది. ముఖ్యంగా ఇందులో నాని పోషించిన టైటిల్ రోల్, సాయిపల్లవి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
Next Story