Telugu Gateway
Cinema

'శాకుంతలం'లో స‌మంత ఫ‌స్ట్ లుక్

శాకుంతలంలో స‌మంత ఫ‌స్ట్ లుక్
X

స‌మంత‌. ఇటీవ‌ల పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ..ఊఊ అంటావా మావా అనే పాట‌తో దుమ్మురేపిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క సినిమాకు సంబంధించిన అప్ డేట్ వ‌చ్చింది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'శాకుంతలం' సినిమాలో సమంత ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. చారిత్ర‌క క‌థ నేప‌థ్యంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గుణ టీం వర్క్స్ బ్యాన‌ర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. 'శాకుంతలం' ఫ‌స్ట్ లుక్ లో సమంత దేవకన్యలా కనిపిస్తుంది. చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో సమంత లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ కుమార్తె అల్లు అర్హ కీల‌క‌పాత్ర‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు.

Next Story
Share it