గుణశేఖర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో 'సమంత'
BY Admin1 Jan 2021 2:58 PM
X
Admin1 Jan 2021 2:58 PM
సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో సమంత కీలక పాత్ర పోషించనుంది. సమంత ఈ తరహా చారిత్రక పాత్ర పోషించటం ఇదే మొదటిసారి కావటం విశేషం. గుణశేఖర్ సోషల్ మీడియా వేదికగా తన నూతన ప్రాజెక్టు వివరాలను షేర్ చేసుకున్నారు.
శాకుంతలం.. కావ్యనాయకి గా సమంత నటించనుందని శుక్రవారం గుణశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీనిపై సమంత కూడా ట్విటర్ ద్వారా సంతోషం ప్రకటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
Next Story