Telugu Gateway
Cinema

'మేజర్' ఫస్ట్ లుక్ విడుదల

మేజర్ ఫస్ట్ లుక్ విడుదల
X

విలక్షణ హీరో అడవి శేష్ నటిస్తున్న సినిమా 'మేజర్'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో మహేష్ బాబు విడుదల చేశారు. గురువారం నాడు అడవి శేష్ పుట్టిన రోజు కావటంతో ఈ సందర్భంగా మేజర్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ లుక్ విడుదలతోపాటు అడవి శేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు మహేష్ బాబు. మేజర్ లో అడవి శేష్ నటన అత్యుత్తమంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సోనీ పిక్చర్స్, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. 26/11 ముంబయ్ దాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ప్రాణాలొదిలారు.

Next Story
Share it