Telugu Gateway
Cinema

'సీటీమార్' డేట్ ఫిక్స్

సీటీమార్ డేట్ ఫిక్స్
X

గోపీచంద్, త‌మ‌న్నా జంట‌గా నటించిన సినిమా 'సీటీమార్' .ఈ సినిమా సెప్టెంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం నాడు వెల్ల‌డించింది. వాస్త‌వానికి ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా కరోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

మ‌ధ్య‌లో ఓటీటీలో విడుద‌ల చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగినా..ఇప్పుడు థియేట‌ర్ల‌లోనే అని తేల్చిచెప్పారు. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో గోపీచంద్, త‌మ‌న్నాలు కోచ్ లుగా క‌న్పించ‌బోతున్నారు. ఈ సినిమాలో భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశీలు ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Next Story
Share it