Telugu Gateway
Cinema

'సీటిమార్ ట్రైల‌ర్' ...ఈ బ్యాచ్ అయ్యేలోగా మ్యాచ్ అయిపోవాలి

సీటిమార్ ట్రైల‌ర్ ...ఈ బ్యాచ్ అయ్యేలోగా మ్యాచ్ అయిపోవాలి
X

గోపీచంద్, త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్న సినిమానే 'సీటిమార్'. ప‌లు వాయిదాల అనంత‌రం ఈ సినిమా సెప్టెంబ‌ర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా ట్రైల‌ర్ ను హీరో రామ్ మంగ‌ళ‌వారం నాడు విడుద‌ల చేశారు. క‌బ‌డ్డీ కోచ్ లుగా ఈ సినిమాలో గోపీచంద్, త‌మ‌న్నాలు క‌న్పించ‌నున్నారు. ట్రైల‌ర్ లోనూ ఆట‌గాళ్ళ‌ను ఉత్సాహ‌ప‌రిచే ప‌వ‌ర్ పుల్ డైలాగ్ లతో విడుద‌ల చేశారు. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.

ఒక ఊరి నుంచి ఎనిమిది ప్లేయ‌ర్సా?. మీకు రూల్స్ తెలుసా? అని ప్ర‌శ్నిస్తే..రూల్స్ ప్ర‌కారం పంపిస్తే ఆడివస్తారు స‌ర్...రూట్ లెవ‌ల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేప‌ర్ లో వ‌స్తారు అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ ల‌తో ట్రైల‌ర్ క‌ట్ చేశారు. ఒక్క‌సారి కోర్టులో అడుగుపెట్టాక మీ ఫోక‌స్ కూత‌..గీత మీదే ఉండాలి. ఈ బ్యాచ్ అయ్యేలోగా మ్యాచ్ అయిపోవాలి వంటి డైలాగ్ లతో గోపీచంద్ ఆక‌ట్టుకుంటాడు.

Next Story
Share it