'సీటిమార్ ' విడుదల మళ్ళీ మారింది
BY Admin28 Aug 2021 7:07 PM IST
X
Admin28 Aug 2021 7:07 PM IST
గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'సీటిమార్ ' . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మరోసారి మారింది. తొలుత సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు తేదీ మార్చారు. ఈ సారి విడుదల తేదీని సెప్టెంబర్ 10గా ప్రకటించారు.
వినాయకచవితి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్, తమన్నాలు కబడ్డీ కోచ్ లుగా కన్పించనున్నారు. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ, భూమికలు కూడా కీలక పాత్రలు పోషించారు.
Next Story