ప్రత్యేక విమానంలో తమన్నా
BY Admin9 April 2021 5:59 AM GMT
X
Admin9 April 2021 6:00 AM GMT
కరోనా రెండవ వేవ్ భయంకరంగా ఉండటంతో సెలబ్రిటీలు..సంపన్నులు ప్రత్యేక విమానాలే వాడుతున్నారు. తమన్నా భాటియా కూడా ప్రత్యేక విమానంలో ఎక్కుతూ 'హైదరాబాద్..త్వరలో మళ్ళీ కలుద్దాం' అంటూ క్యాప్షన్ జోడించింది. తమన్నా, గోపీచంద్ జంటగా నటించిన సీటిమార్ సినిమా వాస్తవానికి ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా వాయిదాపడింది.
తమన్నా నటించిన లెవెన్త్ అవర్ సినిమా ఆహా ఓటీటీలో విడుదల అయింది. ఇందులో ఆర్తికారెడ్డిగా నటించింది. తొలి వేవ్ లోనే కరోనా కోవిడ్ బారిన పడి..కోలుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సమయంలో కాస్త బరువు పెరిగి అది తగ్గేందుకు మాత్రం చాలా చెమటోడ్చాల్సి వచ్చింది.
Next Story