Telugu Gateway
Cinema

'సెబాస్టియ‌న్ పీసీ524' ట్రైల‌ర్ విడుద‌ల‌

సెబాస్టియ‌న్ పీసీ524 ట్రైల‌ర్ విడుద‌ల‌
X

శర్వానంద్ ను ఢీకొట్ట‌డానికే రెడీ అయిపోయాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఈ యువ హీరో న‌టించిన 'సెబాస్టియ‌న్ పీసీ524' మార్చి4న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. అదే రోజు శ‌ర్వానంద్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించిన ఆడ‌వాళ్లు మీకూ జోహ‌ర్లు సినిమా కూడా విడుద‌ల కానుంది. అయినా స‌రే చిత్ర యూనిట్ 'సెబాస్టియ‌న్ పీసీ524' విడుద‌ల‌కే మొగ్గుచూపింది. ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండపం సినిమాతో హిట్ అందుకున్న కిర‌ణ్ ఈ సినిమాలో రేచీక‌టి ఉన్న కానిస్టేబుల్ గా క‌న్పించ‌నున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు విడుద‌ల చేసింది. రేచీక‌టి ఉన్న కానిస్టేబుల్ రాత్రి డ్యూటీ చేయాలంటే ఎన్ని క‌ష్టాలు ఉంటాయి..రాత్రిళ్లు డ్యూటీ వేసే ఉన్న‌తాధికారుల‌కు సెబాస్టియ‌న్ చేసే రిక్వెస్ట్ ల‌తో కూడిన ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో ట్రైల‌ర్ క‌ట్ చేశారు. ఈ సినిమాలో కిర‌ణ్ కు జోడీగా నువేక్ష న‌టించింది. ఈ సినిమాకు క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది బాలాజీ స‌య్య‌పురెడ్డి.

Next Story
Share it