తొలి సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంతోనే ఆకట్టుకున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు కిరణ్ 'సెబాస్టియన్ పీసీ524' మూవీ తో వస్తున్నాడు. ఇది ఫిబ్రవరి 25న విడుదల కానుంది. శనివారం నాడు చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఇందులో కిరణ్ రేచీకటి ఉన్న పోలీస్ కానిస్టేబుల్ గా నటించాడు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా నువేక్ష నటించింది. రేచీకటి ఉన్న వ్యక్తికి పోలీస్ స్టేషన్ లో రాత్రి డ్యూటీ పడితే ఉండే ఇబ్బందులను చూపిస్తూ టీజర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు.