Telugu Gateway
Cinema

అక్టోబర్ 27 నుంచే

అక్టోబర్ 27 నుంచే
X

ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కించుకున్న సినిమా సత్యం సుందరం. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా...కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మూవీ సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎన్టీఆర్ సినిమా ప్రభావం ఉన్నా కూడా సత్యం సుందరం మూవీ మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది. అక్టోబర్ 27 నుంచి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ ప్రకారం చూస్తే ఓటిటి లో సత్యం సుందరం సినిమా రికార్డు లు నమోదు చేయటం ఖాయం అని చెప్పొచ్చు.

Next Story
Share it