'శశి' ట్రైలర్ విడుదల
BY Admin10 March 2021 3:02 PM IST
X
Admin10 March 2021 3:02 PM IST
ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన సినిమా 'శశి. ఈ సినిమా మాచి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల అయింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
'మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభవుతుంది. ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం' 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Next Story