Telugu Gateway
Cinema

శ‌ర్వానంద్ 'ఒకే ఒక జీవితం' ఫ‌స్ట్ లుక్

శ‌ర్వానంద్ ఒకే ఒక జీవితం  ఫ‌స్ట్ లుక్
X

హీరో శర్వానంద్‌ 30వ చిత్రంగా తెర‌కెక్కుతున్న 'ఒకే ఒక జీవితం' సినిమా ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు విడుద‌ల చేసింది. ఈ సినిమాకు శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. శ‌ర్వానంద్ గిటార్‌తో డిఫ‌రెంట్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతుంది.

ఈ సినిమాలో శ‌ర్వానంద్ కు జోడీగా రీతు వ‌ర్మ నటిస్తుంది. వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి సహానటులు. ఇందులో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌ పోషించనుండటం విశేషం. త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీకి జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

Next Story
Share it