Telugu Gateway
Cinema

'స‌ర్కారు వారిపాట‌' డేట్ వ‌చ్చేసింది

స‌ర్కారు వారిపాట‌ డేట్ వ‌చ్చేసింది
X

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా స‌ర్కారు వారి పాట. ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. ఏప్రిల్ 1న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. దుబాయ్ తోపాటు పారిస్ ల్లో షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. వేలానికి తేదీ నిర్ణ‌యించాం..ఇక థియేట‌ర్ల‌లో యాక్షనే అంటూ పేర్కొంది. ఈ సినిమా త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పాట‌ల ప‌ని పూర్తి అయింది అంటూ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈపావ‌ళి శుభాకాంక్షల పోస్ట‌ర్ తో రిలీజ్ డేట్ రివీల్ చేశారు..

Next Story
Share it