Telugu Gateway
Cinema

'స‌ర్కారు వారి పాట' మే 12న విడుద‌ల‌

స‌ర్కారు వారి పాట మే 12న విడుద‌ల‌
X

సినిమాల పండ‌గ‌. ఏప్రిల్, మేలో వ‌ర‌స పెట్టి భారీ సినిమాలు క్యూక‌డుతున్నాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య‌, బీమ్లానాయ‌క్ ల‌తోపాటు ఇప్పుడు స‌ర్కారు వారి పాట కూడా వ‌చ్చి చేరింది. ఈ సినిమాను మే 12 విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. యాక్షన్ తేదీని లాక్ చేశాం అంటూ విడుద‌ల తేదీతో కొత్త లుక్ ను విడుద‌ల చేశారు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మ‌హేష్ బాబుకు జోడీగా కీర్తిసురేష్ న‌టిస్తోంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సంస్థ‌. అన్ని సినిమాల త‌ర‌హాలోనే ఇది కూడా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా పిబ్ర‌వ‌రి 14న తొలి సింగిల్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇప్పుడు విడుద‌ల తేదీని కూడా తేల్చేసింది. అతి త‌క్కువ గ్యాప్ లో భారీ బ‌డ్జెట్ మూవీలు అన్నీ క్యూ క‌ట్టాయి.

Next Story
Share it