Telugu Gateway
Cinema

'స‌ర్కారు వారి పాట' జ‌న‌వ‌రి 13న విడుద‌ల‌

స‌ర్కారు వారి పాట  జ‌న‌వ‌రి 13న విడుద‌ల‌
X

మ‌హేష్ బాబు, కీర్తిసురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. శ‌నివారం నాడు విడుద‌ల తేదీని డిఫ‌రెంట్ గా ప్ర‌క‌టించింది. మ‌హేష్ బాబు కారు దిగుతున్న ఫోటోలో డోరుపై విడుద‌ల తేదీని వెల్ల‌డించారు. మ‌రోసారి మ‌హేష్ బాబు కూడా సంక్రాంతి బ‌రిలో నిలిచారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ రాధే శ్యామ్ సంక్రాంతికి రానుంది. దీంతో పాటు ఇంకా పేరు పెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానాల సినిమా కూడా సంక్రాంతి బ‌రిలోనే నిల‌వ‌నుంది.

ఇప్ప‌డు ఇది మూడ‌వ సినిమా. స‌ర్కారు వారి పాట‌ను పి. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా..మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. మ‌హేష్ బాబు న్యూలుక్ పై ఆయ‌న కూతురు సితార స్పందిస్తూ నాన్నా నువ్వు ఎప్ప‌టిలాగానే సూప‌ర్ కూల్ గా క‌న్పిస్తున్నావంటూ ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ చేసింది. సినిమా విడుద‌ల తేదీ రావ‌టంతో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కుషీకుషీగా ఉన్నారు.

Next Story
Share it