Telugu Gateway
Cinema

మ‌హేష్ బాబు బ‌ర్త్ డే స్పెషల్ వ‌చ్చేసింది

మ‌హేష్ బాబు బ‌ర్త్ డే స్పెషల్ వ‌చ్చేసింది
X

స‌ర్కారు వారి పాట సంద‌డి మొద‌లైంది. మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ అభిమానుల‌కు క‌నువిందు చేసేలా బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్ పేరుతో ఓ వీడియోను విడుద‌ల చేసింది. ఇందులో మ‌హేష్ బాబు ఫుల్ ఎన‌ర్జిటిక్ గా..హంగామా చేశాడు. ఈ వీడియోలో ఎక్కువ భాగం ఫైట్స్ త‌ర్వాత హీరోయిన్ కీర్తిసురేష్‌, మ‌హేష్ బాబు ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఉన్నాయి. మ‌ధ్య‌లో వెన్నెల కిషోర్ హంగామా కూడా ఉంది. మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇప్ప‌టికే దుబాయ్ తోపాటు ప‌లు లొకేష‌న్ల‌తో చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. కీర్తిసురేష్ చీర‌క‌ట్టుకుని జ‌డ‌నిండా మ‌ల్లె పూలు పెట్టుకుని వెళుతుంటే..ఏమ‌య్యా కిషోర్..ఓ ఐదారు మూర‌లు ఉండ‌వు అవి అంటూ మ‌హేష్ బాబు చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది ఈ వీడియోలో. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 13న విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మహేష్ బాబు చేస్తున్న తొలి సినిమా ఇది. త‌మ‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it