మహేష్ బాబు కొత్త రికార్డు
BY Admin22 March 2022 11:45 AM

X
Admin22 March 2022 11:45 AM
సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ కుమ్మేస్తోంది. మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తొలి సింగిల్ గా విడుదలైన కళావతి పాట వంద మిలియన్ల వ్యూస్ సాధించింది. టాలీవుడ్ లో అత్యంత వేగంగా వంద మిలియన్లు సాధించిన తొలి పాట ఇదేనని చిత్ర యూనిట్ వెల్లడించింది. తాజాగా విడుదలైన పెన్నీ పాట కూడా ట్రెండింగ్ లో ఉంది. ఈ పాటలో మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని స్టెప్పులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Next Story