Telugu Gateway
Cinema

నాని దూకుడు

నాని దూకుడు
X

హీరో నాని సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా దూకుడు చూపిస్తున్నారు. దసరా తర్వాత ఇప్పుడు నాని కొత్త సినిమా హాయ్ నాన్న డిసెంబర్ 7 న విడుదలకు సిద్ధం అవుతోంది. దసరా సందర్భంగా నాని కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. సరిపోదా శనివారం అనే టైటిల్ తో నాని మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుంటే...ఇందులో నాని కి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. డివివి బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది నాని 31 వ సినిమా. ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది అనే మాట ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సాయి కుమార్ వాయిస్ తో విడుదల చేసిన వీడియో ను చూస్తే అర్ధం అవుతుంది. జీవితంలో ఒక్క రోజు వస్తేనే సరిపోతుంది అనుకునే వాళ్లకు..ప్రతి శనివారం అలాంటి రోజు అయితే అలాంటి వాడిని ఎవరైనా ఆపగలరా...శనివారం...సరిపోదా శనివారం అంటూ వెలువడిన వీడియో సినిమాపై ఆసక్తి పెంచింది అనే చెప్పాలి.

Next Story
Share it