Telugu Gateway
Cinema

నాని ప్లాన్స్ సక్సెస్

నాని ప్లాన్స్ సక్సెస్
X

సరిపోదా శనివారం అంటూ వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ దక్కించుకున్నాడు హీరో నాని. అంతే కాదు..నాని కెరీర్ లోనే ఈ సినిమా వంద కోట్లు సాధించిన రెండవ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. దసరా సినిమాతో నాని తొలిసారి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధిస్తే...ఇప్పుడు సరిపోదా శనివారం వంద కోట్ల వసూళ్ళలో రెండవ సినిమా. ఆగస్ట్ 29 న విడుదల అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది . సెప్టెంబర్ 26 నుంచి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ ఈ విషాయాన్ని అధికారికంగా ప్రకటించింది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది అని తెలిపింది.

ఈ సినిమాలో హీరో నాని తో పాటు నెగిటివ్ రోల్ లో కనిపించిన ఎస్ జె సూర్య నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రసంశలు దక్కాయి. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీ లో నాని కి జోడిగా ప్రియాంక మోహన్ నటించింది. నాని ఒక వైపు క్లాస్ సినిమాలతో పాటు ఇటు మాస్ సినిమా లు చేస్తూ తన మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. నాని చేస్తున్న ప్రయోగం సత్ఫాలితాలనే ఇస్తున్నట్లు ఉంది. అది ఎలా అంటే అటు దసరా, ఇటు సరిపోదా శనివారం సినిమాలు రెండూ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించటమే అని చెప్పొచ్చు. ఇదే జోష్ తో ఈ నాచురల్ స్టార్ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేయటానికి రెడీ అవొచ్చు అని భావిస్తున్నారు.

Next Story
Share it