Telugu Gateway
Cinema

కార్తి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

కార్తి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
X

హీరో కార్తీ తెలుగు లో ఇప్పుడు హిట్ 4 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా అప్ డేట్స్ ఏమీ పెద్దగా బయటకు రాలేదు. తెలుగు లో కార్తీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కార్తీ హీరోగా నటించిన సర్దార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. 2022 అక్టోబర్ 21 న ఈ మూవీ విడుదల అయింది. ఇప్పుడు సర్దార్ 2 రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 10 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తీకి జోడిగా ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ లు నటిస్తున్నారు. దర్శకుడు....విలక్షణ నటుడు ఎస్‌జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నా సర్దార్ 2 రిలీజ్ డేట్ రావటంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు అనే చెప్పాలి.

Next Story
Share it